- Advertisement -
- సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్
నవతెలంగాణ-మద్నూర్: ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం పాలకవర్గం పదవీ కాలాన్ని మరో ఆరు మాసాలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వానికి మద్నూర్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సింగిల్ విండో కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఆ తర్వాత చైర్మన్ విలేకరులతో మాట్లాడుతూ.. పాలకవర్గం పదవీకాలం మరో ఆరు మాసాలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర సింగిల్ విండో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు, జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావుకు పాలకవర్గం తరపున ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్వతంత్ర వేడుకల్లో పాలకవర్గం సభ్యులు సింగిల్ విండో కార్యదర్శి జె బాబురావు పటేల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -