- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) అధినేత్రి ఖలీదా జియా అంత్యక్రియలు ఈ రోజు జరగనున్నాయి. ఢాకాలోని జియా ఉద్యానంలో, తన భర్త, మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ సమాధి పక్కనే ఆమెను ఖననం చేయనున్నారు. ఈ అంత్యక్రియలకు భారత ప్రభుత్వం తరఫున విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ హాజరుకానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
- Advertisement -



