Monday, April 6, 2026
E-PAPER
Homeజిల్లాలుఉపాధిలో కంటి ఫోటో విధానాన్ని రద్దు చేయాలి

ఉపాధిలో కంటి ఫోటో విధానాన్ని రద్దు చేయాలి

- Advertisement -
  • తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం ఆంజనేయులు
    నవతెలంగాణ-వనపర్తి: మండలంలోని దత్తాయిపల్లి గ్రామ ఉపాధి పని ప్రదేశాన్ని సోమ‌వారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం.ఆంజనేయులు సందర్శించారు. ఈ సందర్భంగా కూలీల సమస్యలను తెలుసుకుని కూలీలను ఉద్దేశించి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీలకు కష్టాలు పెంచే విధంగా కొత్తగా కంటి ఫోటో పద్ధతిని ప్రవేశపెట్టడంతో ఉపాధి కూలీలకు స‌మ‌స్య‌గా మారింద‌ని, దీంతో చేసిన పని కూడా కూలి డబ్బులు రాకపోవడం విచాక‌ర‌మ‌న్నారు. ప్రభుత్వం తక్షణమే కంటి ఫోటో పద్ధతిని రద్దుచేసి కూలీలకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు పని భారాన్ని, సమయ భారాన్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి కూలీలకు రోజు కూలి 800 వందల రూపాయలు ఇవ్వాలని వ్యవసాయంలో పని దినాలు తగ్గిపోవడం మూలంగా ప్రతి జాబు కార్డుకు రెండు వందల రోజుల పని దినాలు కల్పించాలని,కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే కూలీలను సమీకరించి ఆందోళన,పోరాటాలు చేస్తామని సందర్భంగా హెచ్చరించారు. కూలీలు కళావతి, గోపియ,పార్వతి,అలివేల,పుల్లమ్మ,బీసమ్మ,రాములు, కావలి వరమ్మ,బాల కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -