Tuesday, July 22, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్హైద‌రాబాద్‌లో ఫేక్ క‌రెన్సీ దందా

హైద‌రాబాద్‌లో ఫేక్ క‌రెన్సీ దందా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ త‌యారీ ముఠా బాగోతం వెలుగులోకి వ‌చ్చింది. మెహిదీపట్నం పోలీసులు ప్రత్యేక సమాచారం ఆధారంగా ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద రూ.2 లక్షల విలువైన నకిలీ 500 రూపాయల నోట్లు స్వాధీనం అయ్యాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కి చెందిన అన్సారీ అఫ్తాబ్ అజీముద్దీన్‌..న‌గ‌రంలోని అదిల్ హుసేన్‌తో పరిచయం ఏర్పడి, నకిలీ నోట్ల వ్యాపారం కోసం ఇద్దరూ యత్నించారని పోలీసులు వెల్లడించారు. 30 వేల రూపాయల అసలైన నోట్లు ఇస్తే లక్ష రూపాయల నకిలీ కరెన్సీ ఇస్తాడని ఆశచూపాడు. భారీ కమీషన్ వస్తుందని ప్రలోభపెట్టడంతో ఇద్దరూ నకిలీ నోట్లను తెప్పించి నగరంలో చలామణి చేయాలని ప్రణాళిక రచించారు.

ఫస్ట్ లాన్సర్ శ్రీరామనగర్ వద్ద వీరు నకిలీ నోట్లతో ఉన్నారన్న సమాచారం మేరకు మెహిదీపట్నం పోలీసులు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నకిలీ కరెన్సీ తయారుచేసిన ఆకాశ్ కోసం గాలింపు ప్రారంభించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -