Thursday, July 17, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఆదిలాబాద్ లో నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు.. గుట్టురట్టు 

ఆదిలాబాద్ లో నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు.. గుట్టురట్టు 

- Advertisement -

నలుగురిపై కేసు ఇద్దరు అరెస్ట్
అక్రమంగా హౌస్ నెంబర్ ల సృష్టి
కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
: నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు, నకిలీ చలాన్లు సృష్టించి ప్రభుత్వ యంత్రాంగాన్ని మోసం చేసిన నిందితులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. నకిలీ పత్రాల సృష్టిలో నలుగురిపై కేసు నమోదు చేసి, ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. బుధవారం వన్ టౌన్ పీఎస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. శాంతినగర్ కు చెందిన ఫిర్యాదుదారు కౌటివార్ సుశీల్ (63) తాను ఎదుర్కొంటున్న ఆస్తి సంబంధిత మోసాలపై ఫిర్యాదు దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. రంగినేని సూర్యప్రకాశ్ అనే వ్యక్తి తన కుమారుడు రంగినేని శ్రీనివాస్, కుమార్తె రంగినేని స్వేత, అల్లుడు అముల్ జలగంతో కలిసి ప్రభుత్వ రోడ్డును అక్రమంగా అక్రమించి కబ్జా చేసిన ఘటనలో నలుగురిపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.

అముల్ జలగం తప్పుడు దారిలో రోడ్డును కబ్జా చేసి, మున్సిపల్ ద్వారా అసెస్మెంట్ తీసుకొని, డోర్ నెం. 1-1-54/5/1/A/1 శాంతినగర్‌లోని ఓపెన్ ప్లాట్‌కు సంపాదించి, దానికి పన్నులు చెల్లించినట్టుగా రసీదులు చూపిస్తూ.. చెల్లింపుల ఆధారంగా దాన్ని తన భార్య రంగినేని స్వేతకు గిఫ్ట్ డీడ్ (2487/2016) నమోదు చేసినట్లు దీనిని రంగినేని సూర్యప్రకాశ్, ఎన్.బీ. శ్రీకాంత్ అటెస్టు చేశారని వెల్లడించారు. ఈ ఆధారంగా మున్సిపల్ కౌన్సిల్‌ వారు ఆ స్థలాన్ని రంగినేని స్వేత పేరు మీద మ్యూటేషన్ చేసి, ఆదిలాబాద్ అర్బన్ రెవెన్యూ కార్యాలయంలో దానిని దాదాపు 22,900/- రూపాయలను చాలన్ చెల్లించినట్లు నకిలీ చాలన్ పత్రాలు సృష్టించారు.

ఈ పత్రాలు తహసీల్దార్ ఇచ్చినట్ల గా 10.11.2017న పట్టా (నెం. C/1246/104) నకిలీ క్రమబద్ధీకరణ  ఉత్తర్వులను సృష్టించినట్లు పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ రోడ్డుకు చెందినదిగా పేర్కొంటూ.. తమ పరిశ్రమకు సమీపంగా ఉన్న ఈ రోడ్డును అక్రమించటం వలన తాము, అలాగే ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నామని ఫిర్యాదుదారు తెలిపినట్లు పేర్కొన్నారు. రంగినేని శ్రీనివాస్, వారి కుటుంబ సభ్యులు కావాలనే రోడ్డును కబ్జా చేసి నకిలీ చలాన్లను సృష్టించి మున్సిపాలిటీ ద్వారా అక్రమంగా హౌస్ నెంబర్, నకిలీ క్రమబద్ధీకరణ  ఉత్తర్వులను సృష్టించినట్లు తీసుకొని కుటుంబ సభ్యులపై రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం జరిగిందని తెలిపారు. ఎలాంటి చాలన్ రుసుములు చెల్లించలేదు, చాలన్ నెంబర్ నకిలిదే.. రెవెన్యూ అధికారులు క్రమబద్ధీకరణ ఉత్తర్వులు నకిలీవి అని తేలిందని రెవెన్యూ అధికారులు నకిలీవి అని నిర్ధారించినట్లు పేర్కొన్నారు.

అంతిమంగా, రంగినేని సూర్యప్రకాశ్, రంగినేని శ్రీనివాస్, రంగినేని స్వేత, అముల్ జలగం కలసి పకడ్బందీగా పథకం వేసుకుని నకిలీ పత్రాలు సృష్టించి ప్రజా రోడ్డును ఆక్రమించేందుకు కుట్ర పన్నారని తెలిపారు. వీరిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారు కోరడంతో విచారణ జరిపి, నలుగురిపై కేసు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించగా 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించినట్లు తెలిపారు. సమావేశంలో వన్ టౌన్ సీఐ బి సునీల్ కుమార్, రూరల్ సీఐ కె ఫణిదర్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -