Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంపువ్వాడ లక్ష్మణ ఇంట్లో నకిలీ మందుల పట్టివేత

పువ్వాడ లక్ష్మణ ఇంట్లో నకిలీ మందుల పట్టివేత

- Advertisement -

– అతనిపై గతంలోనూ ఇదే తరహా పలు కేసులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

నేర ప్రవృత్తి కలిగిన పువ్వాడ లక్ష్మణ ఇంట్లో పెద్దఎత్తున నిల్వ ఉంచిన నకిలీ మందులు పట్టబడ్డాయి. విశ్వసనీయ సమాచారం మేరకు డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు హైదరాబాద్‌ మలక్‌పేట్‌లోని మూసారాం బాగ్‌లోనిలక్ష్మణ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. దాదాపు రూ.5.1 లక్షల విలువైన నకిలీ మందులతో పాటు యాంటీబయాటిక్స్‌, యాంటీ హైపర్‌టెన్సివ్‌, అబార్షన్‌ కిట్లు దొరికినట్టు అధికారులు తెలిపారు. ఎలాంటి లైసెన్స్‌ లేకుండా మందులు నిల్వ ఉంచినట్టు వారు వెల్లడించారు. అతనిపై ఇది వరకే నకిలీ మందులకు సంబంధించి పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పట్టబడ్డ వాటిలో నాలుగు అనుమానిత నకిలీ మందులను గుర్తించారు. కేసు నమోదు చేసిన అధికారులు విచారణ చేపట్టామని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad