Tuesday, October 28, 2025
E-PAPER
Homeజాతీయంత‌గ్గిన‌ బంగారం, వెండి ధ‌ర‌లు

త‌గ్గిన‌ బంగారం, వెండి ధ‌ర‌లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: నిన్న మొన్నంటి వ‌ర‌కు ప‌రుగు పందెం పోటీ మాదిరిగా నువ్వు-నేనా అన్న‌ట్లుగా బంగారం-వెండి ప‌రుగులు తీశాయి. ప్ర‌స్తుతం రేసు గుర్రంలా ప‌రుగెత్తి..కాస్తా విరామం తీసుకున్న‌ట్లు అనిపిస్తోంది. ఈక్ర‌మంలో ప‌సిడి రేట్లు ప‌లు రోజులు నుంచి త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. దీంతో కొనుగోలుదారులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో మధ్యాహ్నం సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1.22 లక్షలుగా నమోదైంది. కిలో వెండి ధర రూ. 1.48 లక్షల వద్ద కొనసాగుతోంది. బంగారం ధర గరిష్ఠ స్థాయి నుంచి రూ.10 వేలకు పైగా తగ్గింది. ఈరోజు కిలో వెండి ధర రూ. 5 వేలకు పైగా దిగొచ్చింది.

అయితే అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, పసిడి పెట్టుబడుల్లో లాభాల స్వీకరణ వంటి కారణాల వల్ల పసిడితో పాటు వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. ముఖ్యంగా, అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందనే అంచనాలు ఈ ధరల దిద్దుబాటుకు ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -