Saturday, April 4, 2026
E-PAPER
Homeజాతీయంకేర‌ళంపై అవాస్త‌వాల‌ను తిప్పికొట్టాలి: పినరయి విజయన్

కేర‌ళంపై అవాస్త‌వాల‌ను తిప్పికొట్టాలి: పినరయి విజయన్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కేర‌ళం అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో అధికార కూట‌మి ఎల్‌డీఎప్ ప్రచారాన్ని ముమ్మ‌రం చేసింది. ధర్మదం నియోజకవర్గంలోని కన్నూర్ పొడువచెరిలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఎన్నిక‌ల ప్ర‌చారం చేప‌ట్టారు. కేర‌ళం అభివృద్ధిపై ప్ర‌తిప‌క్షాలు, కిరాయి మూక‌లు చేస్తున్న అవాస్త‌వాల‌ను తిప్పికొట్టాల‌ని, అందుకు పార్టీ శ్రేణులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. త‌మ ప్ర‌భుత్వం చేసిన అభివృద్ధిని విస్త్రృతంగా ప్ర‌జ‌లలోకి తీసుకెళ్లాల‌ని, వాస్త‌వాల‌ను ఓట‌ర్లకు తెలియ‌జేయాల‌ని సూచించారు.

ఇటీవ‌ల కోజికోడ్‌లో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. కేరళలో సంపూర్ణ పేదరికాన్ని నిర్మూలించడమేనని మేనిఫెస్టో వాగ్దానం చేస్తోంది. యూడీఎఫ్ ప్రభుత్వ హయాంలో రూ. 600గా ఉన్న సంక్షేమ పింఛనును పదేండ్లలో రూ. 2,000కి పెంచారు. ఈ మొత్తాన్ని రూ. 3,000కి పెంచుతామని ఎల్‌డీఎఫ్ వాగ్దానం చేస్తోంది.ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం కేటాయిస్తామని లెఫ్ట్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎల్‌డీఎఫ్‌) ప్రకటించింది.

వేతన సంస్కరణలు అమలు చేయబడతాయి. ధరల పెంపును నిలిపివేస్తాము, సముద్ర జీవనాధార బిడ్డకు సముద్ర భద్రతను కల్పిస్తాము, కేఎస్ఆర్టీసీని లాభదాయకంగా మారుస్తాము, జల రవాణా మరియు వాటర్ మెట్రోను బలోపేతం చేస్తాము, నూతన కేరళ కోసం ప్రజా ప్రణాళికా ఉద్యమం, విద్యుత్ కోతలు లేని కేరళ, స్మార్ట్ రోడ్ల రూపకల్పన, హై-స్పీడ్ రైల్వే మరియు రైలు రవాణా నెట్వర్క్, మద్దతు ధరల పెంపు, సాంప్రదాయ పరిశ్రమల ఆధునీకరణ, తోట పంటల కోసం నూతన కార్యాచరణ కార్యక్రమం, ప్రభుత్వ రంగ విస్తరణ, పర్యాటక రంగ వృద్ధి, మిషన్ 100,000, మరియు మానవ-వన్యప్రాణుల సంఘర్షణ తగ్గింపు వంటి అనేక ప్రకటనలను మేనిఫెస్టోలో చేశారు. కాగా, ఏప్రిల్ 9న‌ 140 అసెంబ్లీ స్థానాల‌కు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మే 4న పోలింగ్ ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -