Monday, December 29, 2025
E-PAPER
Homeజాతీయంఅభిమానుల అత్యుత్సాహం.. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కిందపడిపోయిన హీరో విజయ్

అభిమానుల అత్యుత్సాహం.. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కిందపడిపోయిన హీరో విజయ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తమిళ అగ్ర నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేత దళపతి విజయ్‌కు చెన్నై విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. అభిమానుల అత్యుత్సాహం కారణంగా ఏర్పడిన తోపులాటలో ఆయన అదుపుతప్పి కిందపడిపోయారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే ఆయనను పైకి లేపి సురక్షితంగా కారు వద్దకు తీసుకెళ్లారు. ఈ ఘటనలో విజయ్‌కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అభిమానులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ‘జననాయగన్’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం కోసం మలేసియా వెళ్లిన విజయ్, ఈవెంట్ ముగిశాక చెన్నైకి తిరిగి వచ్చారు. ఆయన రాక గురించి తెలుసుకున్న వందలాది మంది అభిమానులు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. తమ అభిమాన నటుడిని దగ్గరగా చూసేందుకు ఒక్కసారిగా ముందుకు రావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -