Sunday, November 2, 2025
E-PAPER
Homeతాజా వార్తలుస్పెషల్‌ బస్సుల్లోనే చార్జీల సవరణ : టీజీఎస్‌ ఆర్టీసీ

స్పెషల్‌ బస్సుల్లోనే చార్జీల సవరణ : టీజీఎస్‌ ఆర్టీసీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : టికెట్‌ చార్జీలు పెరిగాయనే ప్రచారంలో వాస్తవం లేదని, దసరా స్పెషల్‌ సర్వీసుల్లోనే చార్జీల సవరణ చేపట్టామని టీజీఎస్‌ ఆర్టీసీ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. స్పెషల్‌ బస్సుల్లో మాత్రమే సాధారణ చార్జీలో 50 శాతం వరకు సవరణ అమల్లో ఉంటుందని తెలిపింది. ఆర్టీసీలో 2003 నుంచి ఈ పద్ధతి ఆనవాయితీగా వస్తున్నదని పేర్కొంది. ఇప్పుడే కొత్తగా చార్జీల సవరణ చేస్తున్నట్టు కొందరు దుష్ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికింది. ప్రధాన పండుగలైన సంక్రాంతి, దసరా, రాఖీ పౌర్ణమి, వినాయక చవితి, ఉగాది తదితర సమయాల్లో హైదరాబాద్‌ నుంచి ప్రయాణికులు ఎకువగా సొంతూళ్లకు వెళ్తుంటారని, రద్దీ మేరకు హైదరాబాద్‌ సిటీ బస్సులను కూడా జిల్లాలకు తిప్పుతున్నామని తెలిపింది. ఈ నెల 20 నుంచి నడిచే స్పెషల్‌ బస్సుల్లోనే చార్జీల సవరణ చేయనున్నామని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -