నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని లాడేగావ్ గ్రామంలో ఎంపీపీ ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మస్రత్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఫేర్వెల్ పార్టీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ రాజశేఖర్ పటేల్, మండల విద్యాధికారి తిరుపతయ్య, పి ఆర్ టి యు నాయకులు పాల్గొన్నారు . ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులకు శాలువాలతో సన్మానించడం జరిగింది. అనంతరం విద్యార్థులతో ఆటపాటలు నిర్వహించి సాస్కృతిక కార్యక్రమాలు
ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం నుండి పాఠశాల ఆవరణ మొత్తం పండుగ వాతావరణంలో తయారైంది. విద్యార్థులు తమ తమ నైపుణ్యాన్ని ఆటపాటల ద్వారా ప్రదర్శించడం జరిగింది. ప్రతి ఏట నిర్వహించే ఫేర్వెల్ పార్టీ నిర్వహణ ఆటపాటల కన్నా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం ఎంతో సంతోషాన్ని ఇచదని పాఠశాల హెచ్ఎం మస్రత్ అన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రత్యేకంగా సన్మానించి జ్ఞాపికలను అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్ ఈ ఓ , పి ఆర్ టి యు నాయకులు సుంకరి శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు , తదితరులు, పాల్గొన్నారు.



