Sunday, April 5, 2026
E-PAPER
Homeక్రైమ్విద్యుత్ షాక్‌తో రైతు మృతి..

విద్యుత్ షాక్‌తో రైతు మృతి..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లాలో విద్యుత్ షాక్ కు గురై రైతు మృతి చెందాడు. ఈ విషాదకర సంటన మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన దొండ కొమురయ్య (58) తన పొలం వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై ఆదివారం ఉదయం మృతి చెందారు. పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లి మోటర్ ఆన్ చేస్తుండగా స్విచ్‌కు విద్యుత్ సరఫరా కావడంతో షాకు గురై ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -