Friday, May 9, 2025
Homeరాష్ట్రీయంరైతు అనుకూల విధానాలు అనుసరించాలి

రైతు అనుకూల విధానాలు అనుసరించాలి

- Advertisement -

– లేకపోతే దేశానికి ఆహార భద్రత ఉండదు
– మోడీ క్షమాపణలు చెప్పారు కానీ గిట్టుబాటు ధర కల్పించలేదు: ఏఐయూకేఎస్‌ ధర్నాలో వక్తలు
నవతెలంగాణ – ముషీరాబాద్‌

”దేశంలో రైతు అనుకూల విధానాలు అనుసరించకపోతే ఆహార ముప్పు ఏర్పడుతుంది.. సాగు వ్యతిరేక నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు రెండేండ్లు పోరాటం చేశాక దిగొచ్చిన ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పారు కానీ.. పంటలకు గిట్టుబాటు ధరలు మాత్రం కల్పించడం లేదు.. రైతులు చని పోతున్నా చలించడం లేదు..” అని పలువురు వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు అనుకూల విధానాలు అనుసరించాలని లేకుంటే దేశానికి ఆహార భద్రత ఉండదని తెలిపారు. ఏఐయుకేఎస్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద గురువారం రైతు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా వ్యవ సాయ ఆర్థిక నిపుణులు డి.పాపారావు మాట్లాడుతూ.. పాలకుల తప్పుడు విధానాలతో వ్యవసాయ రంగం సంక్షోభం ఎదుర్కొంటోందని చెప్పారు. స్వామినాథన్‌ కమిషన్‌ ప్రతిపాదనలకు అనుగుణంగా సమగ్ర పంటల ఖర్చు ప్రతిపాదికన రైతు పండించిన పంటలన్నిటికీ కనీస మద్దతు ధరలు నిర్ణయించాలని డిమాండ్‌ చేశారు. కనీస మద్దతు ధరపై కేంద్రం చట్టం చేయాలని కోరారు. కార్పొరేట్‌ అనుకూల జాతీయ వ్యవసాయ మార్కెటింగ్‌ విధానాన్ని ఉపసంహరించు కోవాలన్నారు. రైతులు బాగుంటేనే కొనుగోలు శక్తి పెరుగుతుందని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో 2006 అటవీ హక్కుల చట్టం అమలు చేయాలన్నారు. సాగుదారులందరికీ పట్టాలు ఇవ్వడం లేదని, సాగులో ఉన్న గిరిజన, గిరిజన ఇతర ప్రజలందరికీ చట్టం ప్రకారం పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్పొరేట్‌ అనుకూల గ్రామీణ సూపర్‌ రిచ్‌ విధానాలను ఓడించడానికి దేశవ్యాప్తంగా ఐక్య ఉద్యమం కోసం రైతులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఏఐయుకేఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు కెచ్చెల రంగారెడ్డి మాట్లాడుతూ.. రైతులకు వడ్డీ లేని రుణాలు, విత్తనాలు, ఎరువులు, సకాలంలో సరఫరా చేయాలని, అటవీ హక్కుల చట్టం 2006 సమగ్రంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. చిన్న, సన్నకారు, మధ్య తరగతి రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయాల న్నారు. అన్ని వ్యవసాయ ఉత్పత్తులకూ ఎంఎస్‌పీ కోసం చట్టపరమైన హామీ ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పల ప్రభాకర్‌ మాట్లాడుతూ.. పాలకులు కనీస మద్దతు ధరలను ఇష్టం వచ్చినట్టు నిర్ణయిస్తుం డటం వల్ల రైతులు నష్టపోతున్నారన్నారు. స్వామి నాథన్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం సమగ్ర ఖర్చుల మీద 50 శాతం లాభం కలిపి పంటలకు ధరలు నిర్ణయిస్తే రైతు ఆదాయాలు పెరుగు తాయని తెలిపారు. ఈ ధర్నాలో ఏఐయుకేఎస్‌ ఉపాధ్యక్షులు డి.రాము, రాష్ట్ర సహాయ కార్యదర్శి నంది రామయ్య, చిన్న చంద్రన్న, బిక్షం అన్న, దేవరాం, సురేష్‌, యాదగిరి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -