నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడులో అన్నదాతలు రోడ్డెక్కారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. చెన్నై ఎగ్మోర్‌లోని రాజరథినం స్టేడియం సమీపంలో తమిళనాడు నది ట్యాంక్ ఇరిగేషన్ రైతుల సంఘం సభ్యులు నిరసన చేపట్టారు. వ్యవసాయ నీధులను పెంచాలని, అందుకు నూతన సంస్కరణలు చేపట్టాలని అన్నదాతలు ఆందోళన చేపట్టారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ రాష్ట్రంలో అరటి తోటలు, ఉల్లిగడ్డల సాగు,మొక్కజొన్నలతోపాటు తదితర పంటలు నీట మునిగాయి. దీంతో అన్నదాతలకు భారీ నష్టం వాటిల్లింది. వ్యవసాయ బడ్జెట్‌లో ప్రకటించిన పథకాల అమలు, నష్టపోయిన రైతులకు రుణమాఫీ, డిజిటల్ విద్యుత్ మీటర్ల ఏర్పాటు ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని కూడా వారు ఒత్తిడి చేశారు. స్టాలిన్ ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయించిన నిధులు విడుదల చేయలేదని, రైతు వ్యతిరేక నిర్ణయాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని రైతుల సంఘం అధ్యక్షుడు విశ్వనాథన్ డిమాండ్ చేశారు.
తమిళనాడులో అన్నదాతల ఆందోళన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES