Monday, February 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సేంద్రియ ఎరువులపై రైతులకు అవగాహన

సేంద్రియ ఎరువులపై రైతులకు అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని కౌలాస్ గ్రామంలో సేంద్రియ వ్యవసాయం గురించి రైతులతో సోమవారం జుక్కల్ మండల్ వ్యవసాయ అధికారిని మహేశ్వరి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహేశ్వరి మాట్లాడుతూ.. ఇటీవలే గ్రామంలోని రైతుల వ్యవసాయ భూముల్లోకి వెళ్లి మట్టిని పరిశీలించామని తెలిపారు. అదేవిధంగా మట్టి నమూనాల సేకరించి వాటిని ల్యాబ్ కి పరీక్షల నిమిత్తం పంపించామని వెల్లడించారు. ల్యాబ్ లో పరిశీలన అనంతరం సూక్ష్మ పోషకాలు, ధాతువులు మట్టిలో తక్కువగా ఉండడం? లేదా ఎక్కువగా ఉన్నాయో? అని పరీక్షల జరిగాయని అన్నారు. రిజల్ట్స్ వచ్చాక కార్డ్స్ రిపోర్ట్ ను రైతులకు అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మహేశ్వరి, గ్రామంలోని రైతులు, వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -