– హనుమంత్ రెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధుల కోసం వినతి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
చౌట్ పల్లి హన్మంత్ రెడ్డి ఎత్తిపోతల పథకానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరుతూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మండల రైతులు కలిశారు. ఈ మేరకు బుధవారం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని హైదరాబాద్ లో వారి నివాసంలో రైతులు కలిశారు. ఈ సందర్భంగా చౌట్ పల్లి ఎత్తిపోతల పథకం లీకేజీల రిపేర్ తో పాటు అదనపు ట్రాన్స్ ఫార్మర్ మంజూరు చేయాలని, కొన్ని పైపులు అదనంగా ఇవ్వాలని రైతులు మంత్రిని కోరారు. రైతుల కోరిక మేరకు సానుకూలంగా స్పందించిన మంత్రి వెంటనే ఎత్తిపోతల పథకానికి అవసరమైన నిధులను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, రైతులు గడ్డం చిన్న నర్సారెడ్డి, వేముల గంగారాం, వేముల చిన్న నర్సయ్య, రంజిత్, తదితరులు ఉన్నారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ ను కలిసిన రైతులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES