Thursday, October 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతుల సమస్యలను పరిష్కరించాలి: ఎమ్మెల్యే పైడి

రైతుల సమస్యలను పరిష్కరించాలి: ఎమ్మెల్యే పైడి

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆలూర్ మండలం డీకంపల్లి గ్రామంలో గురువారం పర్యటించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేను శాలువా, పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  గ్రామస్థులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో గంగాధర్ ఇళ్ల నిర్మాణ పనులు మరింత వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

తదుపరి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియ సజావుగా కొనసాగించాలంటూ అధికారులను ఆదేశించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగాధర్, ఎంపీఓ రాజలింగం, పంచాయతీ సెక్రటరీ దినేష్, ఏవో రాంబాబు, ఏఈఓ వసుధన్, ఐకెపి ఏపిఎం ఉమా కిరణ్, సిఇసి రాజేష్, సంతోష్, అనిత, బిజెపి స్టేట్ కౌన్సిల్ మెంబర్ గిరీష్, ఆలూర్ బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ అరుణ్,బీజేపీ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు నాగన్న, మాజీ ఉపసర్పంచ్ పోశెట్టి, భరత్, ప్రమోద్, బీజేపీ ఆలూర్ మండల అధ్యక్షులు సూర శ్రీకాంత్, విడిసి సభ్యులు, గ్రామ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -