-సీఎస్సీ వద్ద వేకువజామునే బారులు
-యూరియా రాకముందే రైతుల గగ్గోలు
నవతెలంగాణ-బెజ్జంకి : యూరియా కోసం మండలంలో రైతుల బారులు తీరారు.యూరియా కోసం రైతుల తడ్లాటా కొనసాగుతూనే ఉంది.శుక్రవారం మండల కేంద్రంలోని సీఎస్సీ వద్ద వేకువజామున నుండే రైతులు బారులు కట్టారు.మాకు కూడా యూరియా అవసరముందని రైతులు వరస క్రమంలో కోసం ఒకరిపై ఒకరు గగ్గోలు పెట్టుకోవడం యూరియా అవసరతను స్పష్టం చేస్తోంది.
యూరియా రాకముందే బారులు..
మండల కేంద్రంలోని సీఏస్సీకి కేటాయించిన యూరియా నిల్వలు రాకముందే మండలంలోని అయా గ్రామాలకు చెందిన రైతులు వరస క్రమం కట్టి బారులు తీరారు.దీంతో సీఎస్సీ కేంద్రం నిర్వహాకులు యూరియా రాలేదని ..వచ్చాక అందజేస్తామని తెలిపి కేంద్రాన్ని మూసివేసి వెళ్లడం చర్ఛనీయాంశంగా మారింది.
యూరియా వచ్చాకనే..పంపిణీ
సీఏస్సీ కేంద్రానికి యూరియా వాహనం రాకముందే రైతులు బారులు తీరారు.యూరియా రవాణలో ఉంది.సీఏస్సీ కేంద్రానికి కేటాయించిన యూరియాకు అనుగుణంగా టోకేన్లు జారీ చేసి రైతులకు యూరియా పంపిణీ చేస్తాం.
సంతోష్ వ్యవసాయాధికారి బెజ్జంకి
యూరియా కోసం రైతుల బారులు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES