-పీఏసీఎస్ వద్ద వేకువజామునే రైతుల వరుసలు
-టోకన్ లు దొరకక వెనుదిరిగిన రైతులు
నవతెలంగాణ-బెజ్జంకి : యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.రోజులు గడుస్తున్నా యూరియా కొరత తీరక రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.వరి,పత్తి, మొక్కజొన్న,మిర్చి పంటలకు సమయానికి వేయాల్సిన యూరియా నిల్వల్లేక రైతులు కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు.రైతులు తిండితిప్పలు మాని వేకులజామున నుండి కుటుంబ సభ్యులతో కలిసి గంటల తరబడి పడిగాపులు గాసిన దాఖలాలు మండలంలో నిత్యం కనిపిస్తున్నాయి.ప్రభుత్వాలు సత్వరమే యూరియా కొరతను తీర్చాల్సిన అవసరం ఉందని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
పీఏసీఎస్ వద్ద బారులు తీరిన రైతులు..
మండల కేంద్రంలోని పీఏసీఎస్ వద్ద యూరియా బస్తాల కోసం సోమవారం వేకువజామున నుండి గంటల తరబడి రైతులు వరుసలు కట్టి బారులు తీరారు.యూరియా బస్తాలకు రైతుల ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్ జిరాక్సులను అందజేయగా సిబ్బంది ఆన్ లైన్ నమోదు చేసుకొని ఆధార్ కార్డుకు ఒకటి లేదా రెండు బస్తాల చొప్పున టోకెన్లు పంపిణీ చేశారు. ముందు వచ్చిన రైతులు తీసున్నప్పటికి ఒకటి రెండు బస్తాల సరిపోవని అంటున్నారు.కొంతమంది రైతులకు టోన్ దొరకక నిరాశతో వెనుదిగిరిగి వెళ్లిపోయారు. అధికారులు సరిపడా యూరియా నిల్వలు వున్నాయని చెబుతున్నపటికి యూరియా అందుబాటులో ఉండడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులపై ప్రభుత్వాలు పక్షపాత వైఖరి..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం..రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై పక్షపాత వైఖరి చూపుతున్నాయి.దేశానికి రైతే ఎన్నేముక అని చెబుతూనే బీజేపీ..రైతు సంక్షేమమే ద్యేయమని రాష్ట్ర కాంగ్రెస్ ప్రగడ్భాలు పలుకుతూ రైతులను కష్టాలపాలు చేస్తున్నారు.రాష్ట్రంలో యూరియా కొరత బీజేపీ పాపమేనని కాంగ్రెస్ శ్రేణులు..కేటాయింపులకు అదనంగా రాష్ట్రానికి యూరియా కేటాయించామని బీజేపీ శ్రేణులు మాట్లాడడం రైతులను మోసం చేయడమే.బీజేపీ,కాంగ్రెస్ ప్రభుత్వాల స్వార్థ రాజకీయాలు మానుకుని యూరియాను అందించాలి.
– దీటీ రాజు,బీఆర్ఎస్ జిల్లా నాయకుడు
యూరియా కోసం రైతుల పడిగాపులు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES