రైతులకు ఉచిత పెరటి కోళ్ల పంపిణీ..
సమగ్ర వ్యవసాయ పద్ధతలపై శిక్షణా..
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
రైతులు సమగ్ర వ్యవసాయాన్ని చేయాలని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ కె.బి. సునీతా దేవి సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల దత్తత గ్రామమైన రాళ్లపేట రైతులకు శనివారం సమగ్ర వ్యవసాయంపై శిక్షణ అందించారు. అనంతరం రైతులకు పెరటి కోళ్ల పెంపకం పై అవగాహన కల్పించి ఉచితంగా 5 వారాల వయస్సున రాజశ్రీ కోడి పిల్లలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డీన్ మాట్లాడుతూ .. రైతులు కేవలం వ్యవసాయం మీదనే కాకుండా వ్యవసాయ ఆధారిత,అనుబంధ చిన్న చిన్న పరిశ్రమలు కోళ్ల పెంపకం, పాడి, పట్టు పురుగులు, పుట్ట గొడుగుల పెంపకం వంటివి చేపట్టి సమగ్ర వ్యవసాయ పద్ధతులు చేసుకోవడం ద్వారా లాభాలు పొందవచ్చని తెలిపారు.రైతులకు ప్రత్యక్షంగా వర్మీ కంపోస్టు, భూసార పరీక్షలు, కందిలో విత్తన ఉత్పత్తి, పుట్టగొడుగుల పెంపకం, ఉద్యాన పంటల నర్సరీల పెంపకం మీద అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సహయ ఆచార్యులు డా. మధుకర్ రావు, డా. సాయి కుమార్, డా. సతీష్, డా. వెంకట్రామ్, యశస్విని, విద్యార్థులు, రాళ్లపేట గ్రామ మాజీ సర్పంచ్ పరుశరాములు, రైతులు నాగరాజు, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
రైతులు సమగ్ర వ్యవసాయ పద్ధతులు చేయాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



