Thursday, March 26, 2026
E-PAPER
Homeనిజామాబాద్రైతులకు తక్షణ నష్టపరిహారం ఇవ్వాలి: బిఆర్ఎస్

రైతులకు తక్షణ నష్టపరిహారం ఇవ్వాలి: బిఆర్ఎస్

- Advertisement -

నవతెలంగాణ-భిక్కనూర్: మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పంట నష్టం పరామర్శ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళవారం కురిసిన అకాల భారీ వడగండ్ల వాన కారణంగా కోతకు వచ్చిన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
వారం రోజుల్లోపు నష్టపరిహారం ప్రకటించకపోతే పరిసర గ్రామాల రైతులతో కలిసి పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. బుధవారం అధికారులు వచ్చి తూతూ మంత్రంగా వివరాలు నమోదు చేసి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే కనీస పెట్టుబడి సహాయం అయినా అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి మాజీ చైర్మన్ పట్లూరి హన్మంత్ రెడ్డి, సర్పంచ్ కోడూరి సాయాగౌడ్, మాజీ రైతు కన్వీనర్ మంద లింగం, మాజీ ఉప సర్పంచ్ బ్రహ్మచారి, మాజీ ఎంపిటిసి రాములు, శ్రీనివాస్ , స్వామి, స్వామి, అనిల్, ఎల్లం, రాజు, పార్టీ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -