Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులకు పంట నష్ట పరిహారం అందించి ఆదుకోవాలి

రైతులకు పంట నష్ట పరిహారం అందించి ఆదుకోవాలి

- Advertisement -

– రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ – మిర్యాలగూడ 
:  మొంథా తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని గూడూరు గ్రామంలో తుఫాన్ కారణంగా నేలకొరిగిన వరి పొలాలను ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించి రైతులను సమస్యలను అడిగి తెలుసుకోని మాట్లాడారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు దెబ్బతిన్న పంట పొలాలకు ఎకరాకు రూ.10వేలు ఇస్తామని ప్రకటించినప్పటికీ సంబంధిత శాఖ అధికారులకు పంట నష్టం అంచనా వేయడం లేదని దీన్ని బట్టీ ప్రభుత్వానికి రైతులకు పరిహారం అందించే ఆలోచన లేదని అర్ధమవుతుందని ఆరోపించారు.

వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన వరి పంట చేతికొచ్చే దశలో నేలమట్టం కావడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు కనీసం రైతులను పరామర్శించకపోవడం, పంట నష్టాన్ని అంచనా వేయకపోవడం వంటి చర్యలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఎద్దేవా చేశారు. యాసంగి ధాన్యానికి సంబంధించిన బోనస్ డబ్బులను ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించలేదని ఆరోపించారు. అదేవిధంగా జిల్లాలోని రైస్ మిల్లర్లు సిండికేట్గా మారకుండా రైతుల ఆవేదనను అర్ధం చేసుకోని ఎలాంటి కొర్రీలు పెట్టకుండా మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం దెబ్బతిన్న పంట పొలాలను వ్యవసాయాధికారుల చేత క్షేత్రస్థాయిలో సర్వే చేయించి దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.30వేల పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ప్రసాద్, రవీందర్, మధు, కోటిరెడ్డి, నాగేశ్వర్రావు, సత్యం, వెంకటేశ్వర్లు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -