Saturday, June 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విత్తనాల ఎంపికలో రైతులు అప్రమత్తంగా ఉండాలి: డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి

విత్తనాల ఎంపికలో రైతులు అప్రమత్తంగా ఉండాలి: డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు(కాటారం)
విత్తనాల ఎంపికలో రైతులు అప్రమత్తంగా ఉండాలని కాటారం డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి సూచించారు.నకిలీ పత్తి విత్తనాల అమ్మకాలపై కట్టడి చేయాలని జిల్లా కలెక్టర్ ఇటీవల ఆదేశించారు. దీంతో కాటారం సబ్ డివిజన్ స్థాయిలో పోలీస్, వ్యవసాయ శాఖ అధికారి, రెవెన్యూ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టి ఉక్కుపాదం మోపుతున్నారు. శుక్రవారం కాటారం మండలంలోని ప్రతాపగిరి గ్రామంలో వ్యవసాయ అధికారి పూర్ణిమ, రైతులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు నకిలీ విత్త నాలు అమ్మిన, రవాణా చేసిన వారిపై కేసులను నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. దళారుల మాటలు నమ్మి రైతులు మోసపో వద్దన్నారు. 450 గ్రాముల బ్రాండెడ్ కంపెనీ విత్తన ధర రూ.901 మాత్రమే.. దాని కన్నా ఎక్కువ ధర చెల్లించవద్దన్నారు. విత్తనాలు కొన్న వెంటనే రశీదు తీసుకోవాలని, ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లుగా తెలిస్తే తమకు సమాచారం అందించాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -