- Advertisement -
– ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ కోడి సుష్మ వెంకన్న
నవతెలంగాణ -చండూరు : వానకాలంలో రైతులకు కావల్సిన నేలకు, పంటకు మేలుచేసే పచ్చిరొట్ట ఎరువును తయారు చేసే విత్తనాలతో పాటు రైతులకు అవసరం అయ్యే తెలంగాణ ప్రభుత్వంచే అందించే (టిఎస్ సీడ్స్) సబ్సిడీ విత్తనాలు చండూరు రైతు సేవసంఘంలో అందుబాటులో ఉన్నాయని సంఘం చైర్మన్ కోడి సుష్మ వెంకన్న తెలిపారు. ఈ సందర్భంగా గురువారం విలేకరులతో ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు సబ్సిడీ పోను ఇచ్చే ద్యాంచ(జీలుగా)30 కేజిలు రూ.2137,సన్షిప్ (జనుము) 40కేజీలు రూ.2510, బిపిటి 25కేజిలు రూ.1075 సబ్సీడీ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వాటిని రైతులు సద్వినియోగం చేసుకొవాలని మండలోని రైతులను ఆమె కోరారు.
- Advertisement -