Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్భూభారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలి…

భూభారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలి…

- Advertisement -

జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి…
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ :  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతనంగా రూపొందించిన భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కోసం  రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని,  రైతులు సద్వినియోగం చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ వీరారెడ్డి కోరారు. బుధవారం భువనగిరి మండలంలోని అనంతారం గ్రామంలో  భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై,  మాట్లాడారు. రైతులు భూ సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం భూభారతి చట్టాన్ని రూపొందించింది అని తెలిపారు. రైతులు తన సమస్యలను ఫిర్యాదు రూపంలో రెవెన్యూ సదస్సులలో దరఖాస్తు చేసుకొని రిసిప్ట్ పొందాలని సూచించారు. భూ సమస్యల పరిష్కారం కోసం, రైతులు ఇబ్బంది పడకుండా ఉండడం కోసమే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని   తెలిపారు. ఈ కార్యక్రమంలో భువనగిరి తాసిల్దార్ అంజిరెడ్డి, ఆర్ ఐ బలరాం, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad