Thursday, May 29, 2025
Homeతెలంగాణ రౌండప్ఫార్మర్‌ ఐడీ నమోదును రైతులు సద్వినియోగం చేసుకోవాలి

ఫార్మర్‌ ఐడీ నమోదును రైతులు సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -

– మండల వ్యవసాయ అధికారి దుర్గేశ్వరి
నవతెలంగాణ-బొమ్మలరామారం : ఫార్మర్‌ ఐడీ నమోదును రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని బొమ్మలరామారం మండల వ్యవసాయాధికారి ఎన్.దుర్గేశ్వరి సూచించారు. మంగళవారం మండలంలోని మర్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన ఫార్మర్‌ ఐడీ నమోదుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌లో ఏరకమైన చట్టబద్ధత. యాజమాన్య హక్కును కల్పించబోదని, ఇది కేవలం రెవెన్యూ శాఖ వద్ద ఉన్న భూ యాజమాన్య వివరాల ప్రామాణికంగా తీసుకుని రైతులకు ఫార్మర్‌ ఐడీని కేటాయించడం జరుగుతుందన్నారు.. పీఎం కిసాన్‌ లబ్ధిదారులకు తదుపరి విడత లబ్థి పొందుటకు ప్రామాణికంగా ఫార్మర్‌ ఐడీ రిజిస్ట్రేషన్‌ నమోదు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిందన్నారు. ఈమేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో ఫార్మర్‌ ఐడీ రిజిస్ట్రేషన్‌ చేపడుతున్నామన్నారు.రాష్ట్ర పథకాలకు ఫార్మర్‌ ఐడీ రిజిస్ట్రేషన్‌కు ఎటువంటి సంబంధం లేదన్నారు. దీని కోసం రైతులు అధార్‌ కార్డు, పట్టా పాసుబుక్కు, అధార్‌కు లింక్‌ చేసిన పోన్‌ నంబర్‌ తీసుకోని వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలన్నారు.ఈ నెల30 వ తెదిలోగా ప్రతి రైతుల ఫార్మర్‌ ఐడీ రిజిస్ట్రేషన్‌ తప్పని సరిగా చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -