Friday, October 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వర్షాల నుండి పంటలను కాపాడుకోవడానికి రైతులు తగు చర్యలు చేపట్టాలి

వర్షాల నుండి పంటలను కాపాడుకోవడానికి రైతులు తగు చర్యలు చేపట్టాలి

- Advertisement -

మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్
నవతెలంగాణ – పరకాల 

మాంథా తుఫాను ప్రభావంతో పరకాల మండలంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ అకాల వర్షాల కారణంగా చేతికొచ్చిన వరి, పత్తి, మిరప సహా ఇతర పంటలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ మరియు వ్యవసాయ విస్తరణ అధికారి కాటంరాజు తెలిపారు. వర్షంలో నీట మునిగిన పంటలకు సకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే నష్టాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చని వారు రైతులకు సూచించారు. ఏవో శ్రీనివాస్ మండలంలోని పలు గ్రామాలలో పర్యటించి పంటలపై వర్ష ప్రభావాన్ని అంచనా వేశారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ తుపాన్ ప్రభావంతో పంటలు నష్టపోకుండా ఉండడం కోసం సలహాలు సూచనలు అందించడం జరిగింది.

వరి పంటకు తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు:

నీటి పారుదల: పొలం మడులలో నీరు నిలవకుండా చూసుకోవాలి. వచ్చిన నీరు వచ్చినట్టుగా బయటికి వెళ్లేందుకు వీలుగా పొలం గట్లకు గండ్లు పెట్టుకోవాలి.
నేలవారిన పంట: ఈదురు గాలులు, వర్ష ప్రభావంతో నేలవారిన వరి కంకులను నీటిలో తడవకుండా జాగ్రత్తలు పాటించాలి.
పంటను లేపడం: వర్షం తగ్గిన వెంటనే నేలవారిన వరిని పైకి లేపి కట్టుకోవడం వలన గింజ రంగు మారకుండా నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది.
తెగుళ్ల నివారణ (కోత సమయంలో): పంట తెగుళ్ల బారిన పడకుండా ఉండటానికి, లీటరు నీటికి ఒక గ్రాము కార్బండిజం కలిపి పిచికారి చేసుకోవాలి.
బ్యాక్టీరియా సంబంధిత తెగుళ్ల నివారణకు ప్రొపికొనజోల్ 200 మిల్లీలీటర్లను ఒక ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
కోతకు సిద్ధంగా ఉన్న వరి: కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటకు లీటరు నీటికి ఐదు గ్రాముల ఉప్పు ద్రావణాన్ని పిచికారి చేసుకోవాలి.
ధాన్యం: ధాన్యం తడిచినట్లైతే, వెంటనే బాగా ఆరబెట్టుకోవాలి.

 పత్తి పంటకు చేపట్టాల్సిన చర్యలు:
నీరు నిలవకుండా: పత్తి పంట ఉన్న పొలంలో ఎక్కడా నీరు నిలవకుండా చూసుకోవాలి.
పత్తి ఏరడం: వర్షం తగ్గిన వెంటనే పత్తిని ఏరవద్దు. చెట్టు మీద ఉన్న పత్తి మొత్తం ఆరిన తర్వాత మాత్రమే తీయాలి.
నాణ్యత: తడిసిన పత్తిని ఏరినట్లయితే, అది బూజుపట్టి, రంగు మారి, నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది.
నిల్వ: తీసిన పత్తిని పొడి ప్రదేశంలో, పాలిథిన్ కవర్ పైన పరుచుకుని బాగా ఆరబెట్టుకోవాలి.

మిరప పంటకు సలహాలు:
నీటి జాగ్రత్త: మిరప పంటలో కూడా నీరు నిలవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
పోషకాలు: వర్షం తగ్గిన తర్వాత సూక్ష్మపోషకాలను అందించడం వలన ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు తెలిపారు.
రైతులు ఎప్పటికప్పుడు వ్యవసాయ అధికారులను సంప్రదించి, వారి సలహాలు, సూచనలు పాటించడం ద్వారా పంట నష్టాన్ని తగ్గించుకోవాలని మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -