Sunday, November 9, 2025
E-PAPER
Homeకరీంనగర్పత్తి మందును స్ప్రే చేసేటప్పుడు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి

పత్తి మందును స్ప్రే చేసేటప్పుడు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ – జమ్మికుంట
పత్తి మందు స్ప్రే చేసేటప్పుడు రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చిట్టి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నెల  రోజులుగా నా వద్దకు పత్తి మందు స్ప్రే చేసిన రైతులు, రైతు కూలీలు చాలా మంది కంటి అవస్థలతో నా వద్దకు వైద్యానికి వస్తున్నారని తెలిపారు. 

వారి కంటి అవస్థలు వర్ణనాతీతమని అన్నారు. వారు కార్నియల్ ( కంటి నల్ల పాప ) సమస్యలతో వస్తున్నారని తెలిపారు. వీటి వలన దృష్టి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఏపుగా పెరిగిన పత్తి చేనులో తల పైకెత్తి మందు స్ప్రే చేయడం వలన ఆ మందు కండ్లలో పడి కంటి సమస్యలు వస్తున్నాయన్నారు. దానిని నివారించాలంటే తలకు హెల్మెట్ ధరించి పంట పొలాలో క్రిమిసంహారక మందులు స్ప్రే చేయాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -