యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు
అకాల వర్షాలతో వరి, పత్తి,మిర్చి తదితర పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.40 వేల నష్టపరిహారం అందజేయాలని యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్ గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పత్తి చేన్లపై తడిసి ముద్దయిందని, వరి ఈదురు గాలులతో నెల వాలిందని,చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయని తెలిపారు. అంతర్గత రోడ్లు, కొట్టుకపోయాని, ఇండ్లు నెలమట్టం అయ్యాయని, వణుకు, చలిపిడుగులతో ముగజీవాలు మృత్యువాత పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. మానేరు పరివాహక ప్రాంతాల్లో కరెంట్ మోటార్లు, విద్యుత్ తీగలు కొట్టుకపోయాని తెలిపారు. సంబంధించిన అధికారులతో సర్వేలు నిర్వహించి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేలు పరిహారం అందజేయాలి..
- Advertisement -
- Advertisement -



