Monday, November 3, 2025
E-PAPER
Homeఆటలుఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్‌కు భారీ న‌జ‌రానా

ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్‌కు భారీ న‌జ‌రానా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్‌కు హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం నజరానా ప్రకటించింది. రూ.కోటి పారితోషకాన్ని ముఖ్యమంత్రి సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు సోమవారం ఈ నజరానాను ప్రకటించారు. రేణుకా సింగ్‌తో సీఎం ఫోన్లో మాట్లాడారు. ప్రపంచ కప్‌లో విజయం సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టును సైతం ఆయన అభినందించారు. ప్రపంచ కప్‌లో రేణుక ప్రదర్శనను కూడా ముఖ్యమంత్రి ప్రశంసించారు.

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ను (Women’s World Cup) సాధించిన సుదీర్ఘ భారత క్రికెట్‌ చరిత్రలో సువర్ణధ్యాయం లిఖించిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని ఉమెన్‌ ఇన్‌ బ్లూ జట్టు బీసీసీ (BCCI) భారీ నజరానా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.టీమ్‌ఇండియాకు రూ.51 కోట్లు (Cash Reward) ప్రకటించింది.

అలాగే విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టుకు 44 లక్షల 80 వేల డాలర్లు (రూ.39కోట్ల 80లక్షలు), రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టుకు 22లక్షల 40వేల డాలర్లు (రూ.19కోట్ల 90లక్షలు) లభించాయి. సెమీఫైనల్‌లో ఓడిపోయిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ జట్లకు 11 లక్షల 20 వేల డాలర్ల (రూ.9కోట్ల 94లక్షలు) చొప్పున లభించాయి. ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన శ్రీలంక, న్యూజిలాండ్‌ జట్లకు 7 లక్షల డాలర్ల (రూ.6కోట్ల 21లక్షలు) చొప్పున… ఏడు, ఎనిమిదో స్థానాల్లో నిలిచిన బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ జట్లకు 2 లక్షల 80 వేల డాలర్ల (రూ.2కోట్ల 48లక్షలు) చొప్పున లభించాయి. అదేవిధంగా ప్రపంచకప్‌లో ఆడిన ఎనిమిది జట్లకు గ్యారంటీ మనీ కింద 2లక్షల 50వేల డాలర్ల (రూ.2 కోట్ల 22లక్షలు) చొప్పున దక్కాయి. లీగ్‌ దశలో సాధించిన ఒక్కో విజయానికి ఆయా జట్లకు 34వేల 314డాలర్ల (రూ.30లక్షల 47వేలు) చొప్పున లభించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -