నవతెలంగాణ-పెద్దవూర
అటవీ ప్రాంతంలోకి వాహనాలు ప్రవేశించే ప్రక్రియను సులభతరం చేయడానికి అటవి శాఖ అధికారులు ఫారెస్ట్ ఎంట్రీ పాయింట్ల వద్ద ఫాస్ట్ ట్యాగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఫారెస్ట్ ఎంట్రీ పాయింట్ల వద్ద ఫాస్ట్ ట్యాగ్ ఆధారిత సేవలు ప్రారంభించడం వల్ల వాహనల సుధీర్ఘ క్యూలైన్లు, జాప్యాలను నివారించవచ్చు.అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం బెట్టెలతండా వద్ద తెలంగాణ ప్రభుత్వం – అటవీశాఖ ఆధ్వర్యంలో ఫారెస్ట్ చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. తెలంగాణ,
ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్టాల కూడలిలో నల్గొండ జిల్లా గేజెట్ నంబర్ 55 ప్రకారం నూతన చెక్ పోస్టును ఏర్పాటు చేశారు. రెండులైట్లు,4 టైర్స్ గల వాహనములకు 50 రూపాయలు, హెవి 6 టైర్స్ అంతకన్న ఎక్కువ కలిగిన వాహనములకు రూ.80 రుసుము తీసుకుంటున్నారు.
గరిష్ట వేగం గంటకు 30 కిలోమీటర్లు వేగ పరిమితిని అమ్రాబాద్ సర్కిల్ అచ్చంపేట వారిఆదేశాను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అటవీ ప్రాంతం దాటేవరకు వేగనియంత్రణ చేశారు. ఈ చెక్ పోస్ట్‌ల ద్వారా వెళ్లే వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్‌తో తగినంత బ్యాలెన్స్ ఉండాలని, ఫాస్ట్ ట్యాగ్ ఖాతా నుంచి పర్యావరణ నిర్వహణ చార్జీల కోసం వసూలు చేస్తున్నారు. అటవీ శాఖ చెక్‌పోస్ట్‌లలో నాగార్జునసాగర్ హైదరాబాద్ జాతీయ రహదారి పై నేషనల్ హైవే టోల్‌గేట్ల మాదిరిగా ఫాస్ట్ ట్యాగ్ సేవలను అ నుసంధానం చేయడం వల్ల నిత్యం అనేక రాష్ట్రాల నుంచి వందలాది వాహనాలలో నాగార్జున సాగర్ పర్యాటకులు, వస్తారు కాబట్టి ఫాస్ట్ ట్యాగ్ సేవలను అనుసంధానం చేయడంతో టోల్ ఫీజు చెల్లింపుకు ఇబ్బంది ఉండదు. రద్దీగా ఉండే చెక్‌పోస్టుల వద్ద టోల్ రుసుము గురించి చాలా సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడేదని, ఫాస్ట్ ట్యాగ్ సేవలను అనుసంధానం చేయడంతో క్షణాలలో పనులు జరుగుతున్నాయి.
అటవీ శాఖ చెక్ పోస్టులకు ఫాస్ట్ ట్యాగ్ సౌకర్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES