- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: దక్షణ ఇరాన్‌లోని షీరాజ్ సమీపంలో గల ఫార్స్ ప్రావిన్స్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. బస్ బోల్తా పడి 21 మృతి చెందారు. మరో 34మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న అధికారులు..బాధితులను స్తానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఎమర్జెన్సీ శాఖ అధిపతి మసౌద్ అబెత్ తెలిపారు
- Advertisement -