- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌పై నార్సింగి టీఎస్‌పీఏ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి గచ్చిబౌలి వైపు వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



