- Advertisement -
నవతెలంగాణ చెన్నై: తమిళనాడులోని సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ వ్యాన్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టగా, ఆ వెనకే మరో బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 నెలల చిన్నారి సహా 8 మంది అక్కడికక్కడే చనిపోయారు. వీరిలో ఒకే కుటంబానికి చెందిన ఐదుగురు ఉన్నారు. బైక్ పై వచ్చిన తల్లీ కూతురు మృతిచెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
- Advertisement -



