Thursday, September 25, 2025
E-PAPER
Homeజాతీయంఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఒడిశాలోని సుందర్‌గఢ్‌ జిల్లాలో గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కె.బాలింగ్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై రోడ్డు మరమ్మతుల కారణంగా రాంగ్‌ రూట్‌లో వెళ్తున్న ప్రయాణికుల బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -