నవతెలంగాణ-హైదరాబాద్ : అతివేగంగా వెళ్తున్న రెండు వాహనాలు ఒకదానికి మరొకటి ఢీకొనడంతో నలుగురి ప్రాణాలు పోయాయి. ఈ విషాద సంఘటన జమ్మూ కశ్మీర్‌లోని బడ్గామ్ జిల్లా పళర్ ప్రాంతంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. టాటా సుమో , డంపర్ ట్రాక్ ఎదురెదురుగా ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమోలో ప్రయాణిస్తున్న తొమ్మిది మందిలో నలుగురు ఆస్పత్రికి చేరుకునేలోపే మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. మృతి చెందిన వారు మహ్వారా ప్రాంతానికి చెందిన 10 ఏళ్ల జైనబ్, 40 ఏళ్ల నిసార్ అహ్మద్ రాథర్, 36ఏళ్ల బషీర్ అహ్మద్ రాథర్, 60ఏళ్ల ఖతూన్‌గా గుర్తించారు. మిగిలిన ఏడుగురు గాయపడగా వారికి చికిత్స అందిస్తున్నారు.
గాయపడిన వారిలో జూనా బానో, షా, గుల్షన్, తసదూక్ హుస్సెయిన్, రాజా తీవ్రంగా ఉండడంతో వారిని శ్రీనగర్ SMHS ఆసుపత్రికి తరలించారు. సఫియా, పంజాబ్‌కు చెందిన క్రేన్ కాన్డక్టర్ జస్‌బీర్ సింగ్ బడ్గామ్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



