Tuesday, January 20, 2026
E-PAPER
Homeక్రైమ్ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు దుర్మరణం

ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు దుర్మరణం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : నిర్మల్‌ జిల్లా భైంసాలోని సత్‌పూల్‌ బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్‌, కారు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువులను పరామర్శించేందుకు కారులో హైదరాబాద్‌ వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను కుబీరు మండలం కుప్టీ గ్రామానికి చెందిన భోజరాం పటేల్‌ (42), రాజన్న (60), బాబన్న (70), కారు డ్రైవర్‌ వికాస్‌ (35)గా గుర్తించారు. క్షతగాత్రుల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌ గంగాధర్‌ ఉన్నారు. ఆయన తలకు తీవ్రగాయాలు కావడంతో నిజామాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను భైంసా ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -