- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో సోమవారం మధ్యాహ్నం అతివేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ బైక్‌ను ఢీకొనడంతో హోంగార్డు సయ్యద్ హుస్సేన్, కస్టమర్ అక్షిత అక్కడికక్కడే మృతి చెందారు. విధి నిర్వహణ తర్వాత పార్ట్‌టైమ్‌గా ర్యాపిడో బైక్ టాక్సీ నడుపుతున్న హుస్సేన్, అక్షితను గమ్యస్థానానికి చేరుస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించి, కేసు నమోదు చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
- Advertisement -



