Wednesday, November 26, 2025
E-PAPER
Homeక్రైమ్కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం… తెలంగాణ వాసులు నలుగురు మృతి

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం… తెలంగాణ వాసులు నలుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: కర్ణాటకలోని హల్లిఖేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వ్యాను, కారు ఢీకొన్న ఈ ఘటనలో నలుగురు తెలంగాణవాసులు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం జగన్నాథ్‌పూర్‌ గ్రామానికి చెందినవారు. వీరంతా గణగాపూర్‌ దత్తాత్రేయ ఆలయానికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. మృతులను నవీన్ (40), రాచప్ప (45), కాశీనాథ్ (60), నాగరాజు (40)గా గుర్తించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -