- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కెన్యాలోని కకమెగాలో అంత్యక్రియలకు వెళ్లి కిసుముకు తిరిగి వెళ్తుండగా బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం జరిగిన విషాద ఘటనలో 10 మంది పురుషులు, 10 మంది మహిళలు, ఎనిమిది నెలల శిశువుతో సహా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో 20 మంది గాయపడ్డారు. వారిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది.
- Advertisement -