Saturday, October 25, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంనేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది మృతి

నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేపాల్‌లోని కర్నాలి ప్రావిన్స్‌లోని కొండపైకి 18 మంది ప్రయాణీకులతో వెళుతున్న జీపు అదుపుతప్పి 700 అడుగుల లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. 10 మంది గాయాలపాలయ్యారని పోలీసులు శనివారం వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన శుక్రవారం రాత్రి సంభవించింది. ఖాట్మాండుకి పశ్చిమాన దాదాపు 500 కి.మీ దూరంలో ఉన్న రుకుజుమ్‌ వెస్ట్‌ జిల్లాలోని బాఫికోట్‌లోని ఝర్మారే ప్రాంతంలో జరిగింది. జీపు ముసికోట్‌లోని ఖలంగా నుండి అత్బిస్కోట్‌ మునిసిపాలిటీలోని సయాలిఖాది ప్రాంతం వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్‌ అతివేగంతో నడపడం వల్లే జీపు అదుపుతప్పి లోయలోని పడిపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణీకులు అక్కడిక్కడే మృతి చెందారు. ఒకరు గాయాలపాలై స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. చనిపోయిన వారందరూ 15-30 వయసు మధ్యగలవారే. ఈ ఘటనలో గాయాలపాలైన పదిమంది సల్లేలోని రుకుమ్స్‌ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -