నవతెలంగాణ-హైదరాబాద్ : ఔటర్ రింగ్ రోడ్డు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని కారు ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై అతివేగంగా వచ్చిన కారు ముందు వెళుతున్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ధీరజ్ వెంకట సాయి రామ్ (35 )అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
మరో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. క్షతగాత్రుడిని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వెంకట సాయి రామ్ నగరంలోని కర్మాన్‌ఘాట్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.



