- Advertisement -
నవతెలంగాణ ఒంగోలు: ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్లమోటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, కారు ఢీకొన్న ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు. ప్రమాద సమయంలో కారులో 8 మంది ఉన్నారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను బాపట్ల జిల్లా స్టూవర్టుపురం వాసులుగా గుర్తించారు. వీరంతా మహానంది వెళ్లి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు.
- Advertisement -