నవతెలంగాణ-హైదరాబాద్ : కరీంనగర్ బైపాస్ రహదారిపై గురువారం రాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెట్రోలింగ్ విధుల్లో ఉన్న సీఐ ప్రదీప్ తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్-పెద్దపల్లి బైపాస్‌లో బొమ్మకల్ ఫైఓవర్ సమీపంలో ఆగి ఉన్న లారీని కారు పక్క నుంచి ఢీ కొట్టింది. దీంతో కారులో నలుగురు ప్రయాణిస్తుండగా ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. మృతిచెందినవారు సయ్యద్ అబ్దుల్ రహమాన్ (19), సయ్యద్ ఆతియాబ్ హుస్సేన్ (21) కాగా ఎండీ అదునాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఎండీ అబ్రార్ కారులో నుంచి దూకడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



