- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లోని సాగర్ రోడ్డు హస్తినాపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని, నడిచి వెళ్తున్న మరో యువకుడిని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మహావీర్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు శివ, సందీప్ మృతి చెందారు. రోడ్డుపై నడిచివెళ్తున్న మరో యువకుడు కూడా మృతి చెందాడు. దీంతో కారు డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు.
- Advertisement -



