- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ షాద్‌నగర్‌లో మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు దుర్మరణం పాలయ్యారు. అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి, అటుగా వస్తున్న బైక్‌ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు షాద్‌నగర్ పట్టణానికి చెందినవారిగా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
- Advertisement -



