Friday, January 30, 2026
E-PAPER
HomeజాతీయంTrain accident: ఘోర రైలు ప్రమాదం.. ఆరుగురు మృతి

Train accident: ఘోర రైలు ప్రమాదం.. ఆరుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో మంగళవారం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. జైరామ్‌నగర్ స్టేషన్ సమీపంలో ఒక ప్యాసింజర్ రైలు, గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించినట్లు సమాచారం. అదేవిధంగా పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. కోర్బా ప్యాసింజర్ రైలు, ఆగి ఉన్న ఒక గూడ్స్ రైలును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ప్యాసింజర్ రైలు మొదటి బోగీ.. గూడ్స్ రైలు పైకి ఎక్కింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -