- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2025–26 సీజన్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ (41) తన కుమారుడు హసన్ ఈసాఖిల్ (19)తో కలిసి సిల్హెట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఒకే జట్టు తరఫున ఆడారు. నోవాఖాలి ఎక్స్‌ప్రెస్ తరఫున ఆడిన ఈసాఖిల్ తన తొలి బీపీఎల్ మ్యాచ్‌లోనే 60 బంతుల్లో 92 పరుగులు సాధించాడు. తండ్రీకొడుకులు కలిసి నాలుగో వికెట్‌కు 30 బంతుల్లో 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఢాకా క్యాపిటల్స్‌ను 143 పరుగులకే ఆలౌట్ చేసిన నోవాఖాలి ఎక్స్‌ప్రెస్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది.
- Advertisement -



