Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుకుమార్తెను కొట్టి చంపిన తండ్రి

కుమార్తెను కొట్టి చంపిన తండ్రి

- Advertisement -

– ముంబయిలో నీట్‌ ప్రాక్టీస్‌ టెస్ట్‌లో తక్కువ మార్కులు వచ్చాయని..
ముంబయి:
నీట్‌ ప్రాక్టీస్‌ టెస్ట్‌లో మార్కులు తక్కువ వచ్చినందుకు కుమార్తెపై తండ్రి ఆగ్రహించాడు. ఆమెను కర్రతో పదేపదే కొట్టాడు. తలకు తీవ్ర గాయంకావడంతో ఆ యువతి మరణించింది. భార్య ఫిర్యాదుతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మహారాష్ట్రలోని సాంగ్లీలో ఈ సంఘటన జరిగింది. 17 ఏండ్ల సాధన భోంస్లేకు పదో తరగతి బోర్డు పరీక్షల్లో 92.60 శాతం మార్కులు వచ్చాయి. ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్న ఆమె నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌)కు ప్రిపేర్‌ అవుతున్నది. కాగా, సాధనకు నీట్‌ మాక్‌ టెస్ట్‌లో తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో స్కూల్‌ ప్రిన్సిపాల్‌ అయిన తండ్రి ధోండిరామ్‌ ఆగ్రహించాడు. కుమార్తెను కర్రతో పదేపదే కొట్టాడు. తలకు తీవ్రగాయమైన సాధన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జూన్‌ 20న మరణించింది. ఈ నేపథ్యంలో సాధన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తండ్రి ధోండిరామ్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad