Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య

ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య

- Advertisement -

– దుర్వాసనతో పోలీసులకు సమాచారమిచ్చిన స్థానికులు
– సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో ఘటన
నవతెలంగాణ-కొండాపూర్‌

సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని సాయినగర్‌ కాలనీలో తండ్రి తన ఇద్దరు పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొండాపూర్‌ సీఐ వెంకటేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గారకుర్తి గ్రామానికి చెందిన బాయికాడి సుభాష్‌ (45).. సాయినగర్‌ కాలనీలో నివాసముంటూ సదాశివపేట్‌ మండలంలోని ఆత్మకూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య మంజుల, కొడుకు మరియన్‌ (13), కూతురు ఆరాధ్య(9) ఉన్నారు. కాగా, భార్యభర్తలు తరచూ గొడవపడుతూ ఉండేవారు. భార్యపై అనుమానంతో భర్త ఇంటి ఆవరణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. మంజుల వేరే వారితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటంతో వారి ఇద్దరి మధ్య కలహాలు ఏర్పడి ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. దాంతో సుభాష్‌ తీవ్ర మనస్థాపానికి గురై.. మరియన్‌, ఆరాధ్య.. తనకు పుట్టలేదని భావించి మొదట తన ఇద్దరు పిల్లలను ”బండరాయితో” కొట్టి చంపి, తానూ ఉరేసుకున్నాడు. అయితే, సోమవారం సుభాష్‌ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు 100కు కాల్‌ చేసి సమాచారం అందించారు. ఈ ఘటన దాదాపు మూడు రోజుల కిందట జరిగి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. సుభాష్‌ సూసైడ్‌ నోట్‌ రాసి చనిపోవడంతో ఆ నోట్‌ను సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad